రాయికల్ మండలంలో పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ

Published: Thursday September 29, 2022

రాయికల్, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలో  తాట్లవాయి,భూపతిపూర్, రామాజీపేట్ గ్రామాల్లో బతుకమ్మ చీరలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేర కు ఎంపీపీసంధ్యారాణి, జెడ్పిటిసి అశ్విని జాదవ్ తో కలిసి పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి యేట చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జెడ్పిటిసి అశ్వినిజాదవ్ మాట్లాడుతూ తెలంగాణ
బతుకమ్మ పండుగ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం  తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలి కృషె నని తెలుపుతూ,
అనునిత్యం ప్రజల్లో ఉంటూప్రతిసమస్య ను పరిష్కరిస్తూ,ఎందరో చీకటి జీవితాల్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేసి, వెలుగులు నింపిన ప్రజా బంధు,ప్రజానాయకుడు  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మన మండలానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు.
    ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచులు రాగి సాగరిక శ్రీనివాస్, జక్కుల చంద్రశేఖర్,బెజ్జంకి రమాదేవి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంపీటీసీ ఆకుల మహేష్, ఉపసర్పంచులు హరీష్ రావు, ఆకుల మల్లేశం, నాయకులు ఎల్లల దేవేందర్, కంది రంజిత్, లక్ష్మీపతిరావు, కోల రాజు,రమేష్, గడ్డం రాజేశం,మహిపాల్ రెడ్డి, ఆయా గ్రామాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.