ఉరికంబాన్ని ముద్దాడిన నిప్పు కణిక* -ధైర్యానికి ప్రతీక దేశభక్తికి ప్రతిరూపం భగత్ సింగ్.

Published: Thursday September 29, 2022
చేవెళ్ల సెప్టెంబర్ 28:( ప్రజా పాలన)

చేవెళ్ల మండల కేంద్రంలో బాబు జగ్జీవన్రామ్ పారామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో  షాహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నర్సింగ్ రావు  మాట్లాడుతూ పరాయి పాలన నుండి భరతమాత  సంకెళ్లు తెంచడానికి ప్రాణాలనుసైతం  అర్పించడానికి  వెనుతిరగని  యువకుడు భాగతసింగ్, 23 ఎల్లకే ఉరికంబానీ ముద్దడిన స్వాతంత్ర సమరయోధుడు,నిప్పుకానిక  జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం ఎర్ర పూల వనం లో పూలై పుస్తాం,  ఉరి కంబానికి ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిదురిస్తాం, అని  నినాదిస్తూ  ప్రాణాలు   అర్పించిన, వీర యోధుడు, ధైర్యానికి ప్రతీక,దేశభక్తికి ప్రతిరూపం, వీర్తవానికి స్ఫూర్తి ప్రదాత,  నా జీవితం దేశానికి అంకితం అంటూ ఉరితాడును,  ముద్దాడిన  విప్లవ వీరుడు భగత్ సింగ్  అంటూ కొనియాడారు. ఈయన జీవితం దేశ యువతకు ఎంతో ఆదర్శం భగత్ సింగ్  పేరు వింటేనే యువకుల్లో రక్తం మరుగుతోంది,అని .విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని  అయన. సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం కుమార్, భిక్షపతి మహేష్ లక్ష్మి ప్రమీల గార్లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.