కోరుట్ల అభివృద్ధిలో సింహ భాగం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావుదే

Published: Wednesday May 11, 2022

కోరుట్ల, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి): మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 2వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్మికులకు అన్నదానం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. కోరుట్ల పట్టణంలో మున్సిపల్ అవరణలో అభివృద్ధి ప్రదాత, జువ్వాడి రత్నాకర్ రావు 2వ వర్ధంతి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మరియు కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు. జువ్వాడి రత్నాకర్ రావు రాజకీయ ప్రస్థానం తిమ్మాపూర్ సర్పంచ్ గా మొదలై ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన ఆయన చేసిన సేవలు మరువలేనివి అని, ఉన్నతమైనవి అని, గుర్తుచేసుకుంటూ, కోరుట్లకు వెటర్నరీ యూనివర్సిటీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కోరుట్లలోని కొన్ని వేల పేద కుటుంబాలకు సొంతింటి కళ నెరవేర్చిన మహానుభావుడు  జువ్వాడి రత్నాకర్ రావు అని తెలిపారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గనికి మరియు జువ్వాడి రత్నాకర్ రావుకి మధ్య ఉన్న అనుబంధాన్ని, జువ్వాడి రత్నాకర్ రావు చేసిన సేవలను కొనియాడారు. జువ్వాడి రత్నాకర్ రావు 2వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ ఆవరణలో కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ అద్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజంల అధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మరియు సిబ్బందికి అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదానం కార్యక్రమాన్ని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు మరియు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు  సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పేరుమండ్ల సత్య నారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్యం రావు, కోరుట్ల మాజీ జెడ్పిటిసి కొంతం రాజు, 13వ వార్డ్ కౌన్సిలర్ తిరుమల వసంత, పట్టణ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్,ప్రధాన కార్యదర్శులు తుపాకుల భాజన్న,బన్న రాజేశం, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్త, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మెట్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిరెడ్డి, బేజ్జరపు శ్రీనివాస్, మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు మంథని గంగనర్సయ్య, మాజీ కౌన్సిలర్ వహీద్,మాజీ కౌన్సిలర్ హమీద్ మాజీ సర్పంచ్ రెబ్బాస్ రాజన్న మాజీ ఉపసర్పంచ్ విఠల్ రవీందర్ రెడ్డి, పిఏసిఎస్ మాజీ ఛైర్మెన్ రవీందర్ రావు, షకీల్, తోడేటి శంకర్, వొలపు గంగాధర్, చిలివేరి విజయ్, రమేష్, అర్షద్, జాగిలం భాస్కర్, పుల్లా రెడ్డి, సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్, సరీకెళ్ళ నరేష్, కల్లూరు దనని లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.