సంచార జాతుల నిరుపేదలను ఆదుకున్న కార్పొరేటర్

Published: Thursday May 27, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాజీవ్ గృహకల్ప, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల అందజేయాలని భాజపా రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా. మహేశ్వరం నియోజకవర్గంలోని  మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 29వ డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నీలా రవి నాయక్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భాజపా పిలుపుమేరకు సేవాయి సంఘటన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు రాష్ట్ర నాయకులు మాజీ సింగిల్ విండో కొలన్ శంకర్ రెడ్డి చేతుల మీదగా బుధవారం నాడు అందజేశారు. రోడ్లపై గుడిసెలు వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న సంచార జాతులను గుర్తించి మహారాష్ట్ర, సోలాపూర్, మరాటీలు సాయిబాబా రథాలను తయారుచేసుకుని గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్నారు. కరోనా లాక్డౌన్ లో బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో వారి ఆకలి బాధలు గుర్తించిన మంచి మనసుతో కార్పోరేటర్ నీలా రవి నాయక్ దంపతులు వారికి నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు అందజేసి నందుకు మాజీ సింగిల్విండో చైర్మన్ అభినందించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ. సంచార జాతులను  ప్రభుత్వం గుర్తించి వారికి రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నీలా రవి నాయక్ మాట్లాడుతూ.... లాక్ డౌన్ లో రోజు వారి  కూలిపని చేసుకుని బ్రతుకు తెరువు కోసం అల్లాడుతున్న పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా మన ప్రాంతంలోని వలస కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, బడంగ్ పేట్ 13వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మంగపతి నాయక్, జిల్లా ఓ. బి .సి మోర్చా కార్యవర్గ సభ్యులు ఎం.నగేష్, ఎస్టీసెల్ గిరిజన మోర్చా అధ్యక్షుడు రమావత్ శ్రీను నాయక్, జిల్లా సెక్రెటరీ అనిత నాయక్, బడంగ్ పేట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మమతా ఆనంద్, బడంగ్ పేట్ గిరిజన మోర్చా అధ్యక్షుడు శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.