రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Thursday August 18, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు17 (ప్రజాపాలన, ప్రతినిధి) : రక్తదానం చేసి ప్రాణ దాతలు గా నిలవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి ప్రారంభించారు. రక్తదాతల  వివరాలు అడిగి తెలుసుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలోని యువతీ యువకులు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూచించారు. ఈనెల 8 నుండి 22 వరకు జరిగే వజ్రోత్సవాల  సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రోజు మొత్తం 110 మంది పెద్ద ఎత్తున యువకులు హాజరై రక్తదానం చేశారని వారిని అభినందించారు.
అనంతరం కలెక్టర్ ఆయన సతీమణి కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి  ప్రభాకర్ రెడ్డి, సూపరిండెంట్ స్వామి, జెడ్పిటిసి నాగేశ్వరరావు, డాక్టర్లు నాగమణి, సత్యనారాయణ, మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు