అధికార అహంకారంతో విధ్వంస కాండ

Published: Thursday April 14, 2022
మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడుబట్టికోట్లకు తీసేయడం అధికార అహంకారంతో ఎట్టి అవసరం లేకున్నా తగిన ప్రత్యామ్నాయం చూపకుండా భయభ్రాంతులకు గురిచేసి నిస్సా సహాయులను చేసి మానవత్వం చూపకుండా మానవ హక్కులను భంగపరుస్తూ సంసత్సరాల తరబడి చిరువ్యాపారాలు చేసుకొంటున్న బడ్డీకొట్ల వారి బ్రతుకు దెరువుగావున్న బడ్డీకొట్లను ఉన్నతాధికారుల ఆదేశాల పేరుతో మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుండి 3.5 లక్షల రూపాయలు తొలగింపుకు కేటాయించి ఈరోజు ప్రోకలేన్లుతో తొలగించి చిరు వ్యాపారుల జీవణిపాధికి కోలుకోలేని దెబ్బ తీయటాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నది ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషయానికి సంబంధించి ప్రజా ప్రతినిధుల సూచనలకు దమ్మిడీ విలువ ఇవ్వకుండా ఈ విధ్వంస కార్యక్రమం పూర్తి చేయటం కడు శోచనీయమైనదని తెలుగుదేశం ప్రకటిస్తున్నది నష్టపోయిన వారికి తగిన నష్ట పరిహారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, వారి జీవనోపాధికి  ప్రత్యామ్నాయాలు వెంటనే చూపించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది