ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Monday June 27, 2022

జగిత్యాల, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):  పావని కంటి ఆసుపత్రి లో అపి, రోటరీ క్లబ్ సహకారం తో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 27 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు, కంటి అద్దాలు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్, కౌన్సిలర్ లు పంబాల రామ్ కుమార్, కోరే గంగమల్లు, లత జగన్, వైస్ ఎంపీపీ సురేందర్, ఆత్మ ఛైర్మెన్ రాజిరెడ్డి, సర్పంచ్ బొడ్డు దామోదర్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, నాయకులు సత్తిరెడ్డి, రాజేష్, అనిల్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, తదితరులు ఉన్నారు.