మానవత్వం చాటిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. తూమాటి

Published: Wednesday January 12, 2022

మధిర జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి : మధిర రూరల్ ఏరియాా లో-మానవత్వం చాటిన మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి.ఎర్రుపాలెం మండలం నుంచి ప్రయాణికులతో మధిర వస్తున్న ఆటో దెందుకూరు బ్రిడ్జి వద్ద అదుపు తప్పి బొల్తా పడింది దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయాల పాలయ్యారు.అటుగా ఎర్రుపాలెం నుంచి వస్తున్న మధిర నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి 108కి ఫోన్ చేసి గాయాల పాలైన వారిని అంబులెన్స్ ద్వారా మధిర హాస్పిటల్ కి తరలించారు. నవీన్ రెడ్డినిి పలువురు రాజకీయ నాయకులు అభినందిస్తున్నారు