సైనికుల మరణం పట్ల ఠాగూర్ విద్యాసంస్థలు సంతాపం

Published: Friday December 10, 2021

వైరా టౌన్:-తమిళనాడు లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తో పాటు మరో 11 మంది సైనిక సిబ్బంది మరణించడం పట్ల అత్యంత విచారకరమని, ఠాగూర్ విద్యాసంస్థలు అయినా క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ రవికుమార్, చైర్మన్ సునీత మాట్లాడుతూ ఇది భారతదేశానికి తీరనిలోటని, వారికి అస్సలు నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. మరియు వారు చేసిన సేవలు గూర్చి కొనియాడుతూ హాస్పిటల్లో తీవ్రంగా గాయపడి అత్యవసర చికిత్స పొందుతున్న సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిఫిన్ రావత్ కు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సంయోగిత కృష్ణా రావు, రామకృష్ణ, లింగారావు గుంటుపల్లి కృష్ణ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.