వరి కొనుగోలుకేంద్రాన్ని సందర్శించిన డీసీఎంస్ చైర్మన్

Published: Wednesday May 26, 2021
పరిగి, మే 25, ప్రజాపాలన ప్రతినిధి : ఉమ్మడి జిల్లా డీసీఎంస్ ఛైర్మెన్ కృష్ణరెడ్డి మంగళవారం దోమ లోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా రైతుల నుంచి సేకరిస్తున్న వరి ధాన్యం విషయం పై దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చైర్మన్ కు వివరించారు. దోమ కొనుగోలు కేంద్రం లో రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం మిల్ దగ్గర ఇక్కడి నుంచి పంపుతున్న ధాన్యం అక్కడ సకాలంలో ఆన్ లోడ్ కావడం ఆలస్యం అవుతుందడంతో ఇక్కడి కేంద్రంలో వరి కొనుగోలు ఆలస్యం జరుగుతుందని అక్కడి నుండి ధాన్యం తీసుకెళ్లే వాహనాలు సకాలంలో రావడం లేదని రైతులు పేర్కొంటున్న ఇబ్బందులను చైర్మన్ కు సర్పంచ్ రాజిరెడ్డి చెప్పగా,మీ గ్రామంలో లారిలు. డీసీఎం లు ఉంటే ధాన్యం తీసుకువెళ్ళడానికి పెట్టండి అని చైర్మన్ చెప్పడం జరిగింది.అద్దె వాహనాలు అక్కడ ఆన్ లోడ్ త్వరగా కాకుంటే వాహన దారులు అద్దె ఎక్కువగా అడిగే విషయాన్నీ సైతం ప్రస్థావించారు. మిల్ యజమానులతో మాట్లాడి ధాన్యం త్వరగా ఇక్కడి నుండి తరలించే విదంగా కృషి చేయాలనీ సర్పంచ్ కె రాజిరెడ్డి చైర్మన్ కృష్ణరెడ్డి కి తెలిపారు. దోమ. లింగనపల్లి గ్రామాల్లో రైతులు పండించిన దాదాపు 50. వేల బస్తాలు ఉంటాయని ఇప్పటి వరకు 15. వేల బస్తాలు కూడా కొనుగోలు కాలేదని చెప్పారు. వర్షాలు కూడా వచ్చే ఆస్కారం ఉన్నందున రైతులు ఇబ్బందులు పడే విషయం పై ద్రుష్టి సారించాలని సర్పంచ్ చెప్పారు. ఈ కార్యక్రమం లో డీసీఎంస్ మేనేజర్ వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఖాజాపాషా, రైతులు పాల్గొన్నారు.