యాదాద్రి జిల్లా లో మూడు రోజుల పాటు నిలిచిపోయిన త్రాగు నీటీ సరఫరా

Published: Friday December 24, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా 23 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: యాదాద్రి జిల్లాకు సరఫరా చేసే మంచి నీటి పైపు లైన్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. మరమ్మత్తు మూలంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత అధికారి భువనగిరి కార్య నిర్వాహక ఇంజనీర్, డి.లక్ష్మణ్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. యాదాద్రి జిల్లాకు వచ్చే గోదావరి నీరు మెట్రో బోర్డు నీటి గ్రౌండ్ లేవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జియల్.బి.ఎస్.ఆర్) నుండి వచ్చే మెయిన్ పైప్ లైన్ లింగాపూర్ తండా శామీర్ పేట సమీపంలో లీకేజీని గుర్తించడం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై నీటి సరఫరా నిలిపి వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనడసాగుతున్నవని తెలియజేశారు‌. పైప్ లైన్ మరమ్మతుల కారణంగా సుమారు మూడు రోజుల పాటు అనగా తేదీ 23 -12-2021, 24-12-2021 మరియు 25-12-2021 (బేస్త శుక్ర శని వారం) తేదిలలో మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తు పనుల నిమిత్తం నీటి సరఫరా నిలిపివేస్తున్నందున ప్రజలు గమనించి సహకరించాలని తెలియజేశారు. జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, గుండాల, బీబీనగర్, వలిగొండ, భువనగిరి, ఆత్మకూరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, రామన్నపేట(8) మండలాల పరిదిలోని ఆవాసాలకు నీటి సరఫరాను నిలిపి వేయబడునని డి.లక్ష్మణ్, కార్యనిర్వాహక ఇంజనీర్, మిషన్ భగీరథ, భువనగిరి ఈ సందర్భంగా తెలియచేయడమైనది.