వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతగాకనే బీజే

Published: Tuesday July 12, 2022
 సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే.వెంకటేష్
కరీంనగర్ జూలై 11 ప్రజాపాలన ప్రతినిధి :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలు పెంచు తూ సామాన్య, మద్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే.వెంకటేష్  విమర్శించార
సోమవారం నాజు స్థానిక కోతి రాంపూర్ లో గల ముకుంద లాల్ మిశ్రా భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం గీట్ల ముకుంద రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా జే.వెంకటేష్ మాట్లాడుతూ వంట గ్యాస్ తో పాటు నిత్యవసర సరుకుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచుతూ పేద ప్రజల జీవితాలను అతలా కుతలం చేస్తున్నాయన్నారు.
 భారీ వర్షాల మూలంగా పంట,ఇల్లు నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్యకాలంలో హైదరాబాదులో నిర్వహించిన బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ఇతర రాష్ట్రాల ప్రజలను సమీకరించి మా వెనకాల ప్రజాబలం ఉందంటూ ప్రయత్నం చేశారని, కానీ తెలంగాణలో బిజెపికి ఎంత సీన్ లేదని, బిజెపి ప్రభుత్వం వాపును చూసి బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేశారు.ఎనిమిది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, దేశ ప్రజలను వంచించి కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరలను రోజురోజు పెంచుతూ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతున్నారని,అత్యంత లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్,రైల్వే విమానాశ్రయాలను అదాని, అంబానీలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరల పైన మాట్లాడలేని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌనదీక్ష చేస్తున్నారని,అతని వద్ద ప్రజలకు చేప్పే సమాధానం లేదు కనుకనే మౌన దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, తదితర నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలు మోపడం,
రాష్ట్ర ప్రభుత్వంవైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం టిఆర్ఎస్ కేంద్రం పైన ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బే షరత్ గా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేదంటే వామపక్ష,అభ్యుదయ వాదులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం,జి.బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్,ఇ. రమేష్,జి.రాజేశం,S.రజినీకాంత్,నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.