గ్రామపంచాయతీ పనులపై అడిషనల్ కలెక్టర్ తనిఖీ

Published: Wednesday December 14, 2022

జన్నారం, డిసెంబర్ 13, ప్రజాపాలన: మండలంలోని కొనుకలు గ్రామపంచాయతీ పనులపై మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పి రాహుల్ తనిఖీ నిర్వహించారు. మంగళవారం పొన్కల్ గ్రామంలో విస్తృతంగా అడిషనల్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను ఆయన తనిఖీ చేసి పరిశీలించారు. గ్రామములో చేపట్టిన రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలను వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా మన ఊరు మనబడి పల్లె ప్రకృతి వనం గ్రామ నర్సరీ లను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండలం ఎంపీడీవో అరుణాని, ఎంపీఓ రమేష్, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు