రైతుల ఖాతాలో తక్షణమే నగదును జమచేయాలి.. *డేటా ఎంట్రీని ప్రైవేట్ వ్యక్తుల ఇంట్లో కొనసాగించడమే

Published: Wednesday February 01, 2023

 

 ఆపతి రామారావు, వెంకటేశ్వర్లు డిమాండ్..
తల్లాడ, జనవరి 31 (ప్రజా పాలన న్యూస్): 

 *తల్లాడ మండలంలోని పాత మిట్టపల్లి గ్రామంలో రైతులకు తక్షణమే ధాన్యం బస్తాల నగదును జమ చేయాలని బిజెపి మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు, పొంగులేటి వర్గ నేతలు గోపిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ గ్రామంలో వారు రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామానికి చెందిన సుమారు 365 మందికిపైగా రైతులు గంగదేవిపాడు డీసీఎంఎస్ సెంటర్లో ధాన్యాన్ని అమ్మకాలు చేశారని తెలిపారు. సుమారు 45 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు రైతుల నుండి ఆన్లైన్ చేయలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా డేటా ఎంట్రీ ఆన్లైన్ చేసే సెంటర్ ను రైతు వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కాకుండా ఓ ప్రైవేట్ ఇళ్లల్లో నడిపిస్తున్నారని ఆరోపించారు. రైతుల వద్ద నుండి బస్తాకు అధికంగా 3 రూపాయలు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తక్షణమే డేటా ఎంట్రీ సెంటర్ ను రైతు వేదికలో, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ అధ్యక్ష పదవిలో ఉన్న ఈ డీసీఎంఎస్ లో ఇప్పటివరకు నగదు పడకుండా జాప్యం ఎందుకు జరుగుతుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతుల డేటాను ఆన్లైన్ చేయాలని, నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మాగంటి కృష్ణయ్య, నాయకులు పోట్రు శ్రీనివాసరావు, ఎర్రి నరసింహారావు, మాగంటి శ్రీను, షేక్ మీర్జామైబు, మాగంటి వెంకటేశ్వర్లు, చల్లా తిరుపతిరావు, కృష్ణ యాదవ్, మాగంటి శ్రీనివాసరావు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.* ఆపతి రామారావు, వెంకటేశ్వర్లు డిమాండ్..