కొడంగల్ లో లక్ష సభ్యత్వాలను పూర్తి చేసిన కాంగ్రెస్ నాయకులు...

Published: Tuesday March 29, 2022
ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మార్చి 28: కోస్గి : రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో పార్టీ డిజిటల్ సభ్యత్వాలను నియోజకవర్గంలోని కోస్గి మండలం నుండి ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలను పూర్తి చేస్తామని అదే కార్యకర్తలు కూడా భరోసా ఇచ్చి నేడు లక్ష సభ్యత్వాల రుసుమును పార్టీ అది నాయకత్వానికి అందించారు. ఈ క్రమంలో కోస్గి మండలం నుండి 20 వేల సభ్యత్వాలను పూర్తి చేసిన మండల కాంగ్రెస్ నాయకులు 5 లక్షల రూపాయలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వేణుగోపాల్ రావు, తోటకూర జంగయ్య, ముంగి జైపాల్ రెడ్డి లకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో అందించారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు వార్ల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీ నాయకత్వం సూచనల మేరకు అనుకున్న ప్రకారం మండలంలో సభ్యత్వాలను పూర్తి చేయడంలో కార్యకర్తలు విశేష కృషి చేశారని అన్నారు. తమ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఆదేశాల ప్రకారం కార్యకర్తలు పార్టీ పటిష్టతకు పని చేస్తూ, రానున్న రోజులలో కొడంగల్ నియోజక వర్గం లో కాంగ్రెస్ గెలుపు తోపాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు నాగులపల్లి నరేందర్, నాగులపల్లి శ్రీనివాస్, బెజ్జు రాములు, గోవర్ధన్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, వెంకట రాములు, టెంట్ నర్సింలు, వెంకటయ్య, తదితరులున్నారు..