మహనీయుల ఆశయబాటలో గ్రామ అభివృద్ధికి కృషి

Published: Thursday July 07, 2022
దేవరదేశి సర్పంచ్ ఇందిర ఆశోక్
వికారాబాద్ బ్యూరో జూలై 06 ప్రజా పాలన :  భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పట్లూర్ గ్రామంలో అయన చిత్రపటానికి పూలమావేసి ఘనంగా నివాళులర్పించామని గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దళిత, బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేశారని కొనియాడారు. భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధులు బాబుజీగా ప్రసిద్ది చెందారని పేర్కొన్నారు. సమాజం శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దార్శనికుడు అని గుర్తు చేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జన్మించారు.
 అతను 1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన అతను 1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక  రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు. 
 ఇటువంటి మహానీయులను యువత ఆదర్శవంతంగా తీసుకొవాలని మహనీయుల ఆశయ సాధన బాటలో నడవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని గుర్తు చేశారు. పట్లూర్ గ్రామంలో అనేక అభివృద్ధి పనుల చేసి గ్రామాన్ని  అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిదెఆర్ యూత్ అద్యక్షులు సురేష్ ప్రదానకార్యదర్శి వికాస్ తెరాస గ్రామ అద్యక్షులు ఆశోక్ నాయకులు నర్సింలు రమేశ్ అరుణ్ దేవయ్య లాలు షఫి తదితరులు పాల్గొన్నారు.