*కేంద్ర ప్రభుత్వం బిసి కుల గణన చేయాలి* - తెలంగాణ బి సి జాగృతి డిమాండ్

Published: Monday October 03, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 02, ప్రజాపాలన :  తెలంగాణ బి సి జాగృతి  7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీలో తెలంగాణ బి సి జాగృతి జెండా ఆవిష్కరించారు.  
ఈ సందర్భంగా తెలంగాణ బి సి జాగృతి జిల్లా అధ్యక్షులు నరేడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిసి కుల గణన చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర సర్వే లో బి సి ల శాతాన్ని బహిర్గతం
చేయాలని డిమాండ్ చేశారు.బి సి కులాలలో వెనుకబడ్డ వర్గాలకు బి సి బందును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మడుపు రాంప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బిట్రగుంట రాంబాబు, మెంతియాల సంతోష్, కోశాధికారి సల్ల విజయ్ కుమార్, యువ జాగృతి అధ్యక్షులు మాచర్ల సదానందం,  నాయకులు సాగర్, పురెళ్ళ రాజమౌళి, గందె తిరుపతి,హరీష్, సాయి తదితరులు పాల్గొన్నారు.