శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన, విప్ గాంధీ : ఎంపీ రంజిత్ రెడ్డి

Published: Monday January 10, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 9) ; స్థానిక బాపునగర్ లో రాగం సుజాత నాగేందర్ యాదవ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ 40 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ భవనము, వ్యాయామశాలను ప్రారంభించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, డివిజను లోని ప్రతి కాలని, ప్రతి బస్తీలో మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అన్ని వేళలా డివిజన్ లోని ప్రజలందరికీ అందుబాటులో వుండి స్థానిక సమస్యలపై తక్షణమే స్పందిస్తామని, బాపునగర్ ను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు. భవన నిర్మాణానికి సహాయం చేసిన సుజాత. నాగేందర్ యాదవ్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. యువనాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ మరియు వార్డ్ మెంబెర్లు, డివిజన్ లోని పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, బస్తీ కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.