ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి వేడుకలు

Published: Wednesday November 30, 2022
 జన్నారం, నవంబర్ 29, ప్రజాపాలన:  మహాత్మా జ్యోతి రావు పూలే 132వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెట్టుపెళ్లి గంగయ్య ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
 ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే 250 సంవత్సరాల పూర్వం సమాజంలో బడుగు బలహీన వర్గాలకు విద్య అవసరమని, అందరికి విద్య అనే ఫలాలు అందుతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన వ్యక్తిని వారన్నారు. కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైన విద్యను బడుగు బలహీన వర్గాలకు అందించిన గొప్ప వ్యక్తిని మహాత్మ జ్యోతిరావు పూలేను గుర్తు చేసుకున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే నిరంతరం సమాజం అభివృద్ధి కోసం సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించిన గొప్ప ఘనత వారికే చెందుతుందని తెలిపారు. సమాజంలో కుల వివక్ష పై,అంటరానితనం పై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, మహిళలకు విద్యా ఆవకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త పూలేను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం  మండల అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్, బోర్లకుంట ప్రభుదాస్ సయ్యద్ ఫసివుల్లా, కోడూరు చంద్రయ్య, నర్సింలు, కూకటికార్ల బుచ్చయ్య, ఆ డేపు లక్ష్మీనారాయణ, గంగాధర్ గంగన్న, మామిడి విజయ్, మామిడి పెల్లి ఇందయ్యా, బట్టల లచ్చా గౌడ్, వెంకన్న, రమేష్, ప్రశాంత్, అబ్దుల్, ముజ్జు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.