పరిశుభ్రంగా ఉంటే వ్యాదులు సోకవు

Published: Saturday June 19, 2021
కమిషనర్ రమాదేవి, 22వ వార్డ్ కాన్సిలర్ కట్టాగాంధి
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర ఈరోజు డ్రైడే ప్రైడే కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాలిటీ ఏరియాలోని 22వ వార్డ్ నందు పారిశుద్యం కమిటీ బృందంతో ఇంటింటికి తిరిగి దోమలు కుట్టకుండా, పుట్టకుండా, లార్వా నిల్వలు తొలగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మంచి సూత్రంలో ఎంతో అర్ధం ఉందని ఆస్తి కన్నా ఆరోగ్యo ముఖ్యo. కనుక ప్రతి ఒక్కరు వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పారి శుద్యం, త్రాగు నీటి జాగ్రత్తలు పాటించాలి అని తెలియపరిచి నారు. ప్రతి ఒక్కరు కరోనా పై అప్రమత్తంగా ఉండాలి అని తెలిపినారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆరోగ్యసిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.