తండాలకు వెళ్లేందుకు రోడ్లతో కుస్తీపట్టు

Published: Monday October 10, 2022
గుంతలు పడ్డ రోడ్లపై బైక్ తో వెళ్లడం పెద్ద సాహసం

* రోడ్డుపై ఇరుక్కున్న బైకును తోయడానికి మనుషుల ఆవశ్యకత

వికారాబాద్ బ్యూరో 9 అక్టోబర్ ప్రజా పాలన : నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ప్రతిరోజు గుంతలు పడ్డ రోడ్లతో కుస్తీ పట్టు పట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినందుకు అభినందనీయం. తండాలకు రాకపోకలు సాగించేందుకు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించి ఉంటే బాగుండేది కనీసం ఉన్న రోడ్ల నైనా బాగు చేసి ఉంటే గిరి పుత్రుడు ఆనందానికి అవధులు ఉండేవి కావు ఏ చిన్న అవసరం ఉన్నా ఒక తండా నుంచి పట్టణానికి వెళ్లాలంటే గుంతలు పడ్డ రోడ్లనుండి వెళ్లడానికి నరకయాతన పడాల్సి వస్తుంది. నిత్యవసరాలు వైద్య చికిత్స నిమిత్తం పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు గుంతలు పట్ల రోడ్లతో అనునిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్లపైన ఒకే వ్యక్తి బైక్ నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ సాహసించి బైకు గుంతలు పడ్డ రోడ్లపై నుంచి నడపాలంటే ఆ బైక్ అక్కడే ఆగిపోతుంది ముందుకు కదలదు వెనకకు రాదు. వెనకాల నుండి తోడుగా ఎవరైనా వచ్చి ఉంటే బైక్ ముందుకు వెళుతుంది లేకపోతే ఆ వాహనదారుడు గుంతలు పడ్డ రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్ పెట్ మండలం లోని రేగడి మైలారం నుండి వెళ్ళే మూడుమామిళ్ళ తండా, దీప్లా నాయక్ తండా, బీక్యా నాయక్ తండాలకు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రాకపోకలకు తండావాహసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైలారం ఊరిచివరన తండాలకు వెళ్ళేదారిలో ఉన్న పటేల్ చెరువు కట్టకింద దారి మొత్తం పెద్దపెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. నిత్యావసరాల నిమిత్తం తండా నుంచి ఊరిలోకి రావడానికి  వీలులేకుండా అయిపోయిందని తండావాహసులు వాపోతున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈయొక్క మట్టి రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయా తండాల వాసులు కోరుతున్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బద్దెనాయక్, ఉపసర్పంచ్ చందర్ నాయక్,వార్డు మెంబర్ చందర్ నాయక్, జయరాం,పుల్ సింగ్, సుబ్బయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.