ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ లక్ష్యాన్ని చేరుకోవాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Friday December 09, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 8 (ప్రజాపాలన,ప్రతినిధి) : ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి బ్యాంకుల రుణ లక్ష్యాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల రుణ లక్ష్యం రూ1494 కోట్లు లక్ష్యంగా నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో ఎస్బిఐ73 కోట్లు, రుణాలు అందజేసిందని, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 46 శాతం అందజేసిందన్నారు. ఈ మొత్తం ప్రైవేట్ బ్యాంకులైన హెచ్ డి ఎఫ్ సి, ఐసిఐసిఐ, లాంటి వాటితో పోల్చినప్పుడు తక్కువగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల లీకేజీ రుణాలు169 కోర్టు కాగా,170 కోర్టు అందజేసినట్లు తెలిపారు. మిగిలి ఉన్న మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంట రుణాలు రైతుబంధు లాంటి రుణాలు మహిళలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం కోవా హనుమంతు, గిరిజన శాఖ అధికారిని మణెమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.