గురువులే మార్గదర్శకం

Published: Tuesday September 07, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : తిరుమల  హిల్స్ కాలనీలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు 27వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు సుజాత, ఆంజనేయులు, స్వరాజ్యలక్ష్మి, రాజేశ్వరి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్ అరుణ గార్లను సర్వేపల్లి రాధా కృష్ణ జయంతి... గురుపూజోత్సవహాని పురస్కరించుకొని శాలువాతో సత్కరించి సన్మానం చేసినారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... రాజకీయ నాయకులు గానీ, ఉద్యోగుల గాని, సమ సమాజం గాని, అభివృద్ధి జరగాలంటే గురుదక్షిణ ఉండాలని, గురువులే ప్రతి ఒక్క పనులకు మార్గదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ ఫ్లోర్లీడర్ కేసర కీసర గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు హరినాథ్ రెడ్డి, భీమ్ రాజ్, మున్సిపల్ అధికారులు డి.ఈ  గోపీనాథ్, ఏ.ఈ  శ్రీనివాస్, తిరుమల హిల్స్ కాలనీ అధ్యక్షులు రఘు, శ్రీధర్, శ్రీనివాస్, నరసింహ్మ, గిరిరాజ్, గోపాల్, కాలనీవాసులు విద్యార్థులు తోపాటు తల్లిదండ్రులు మాట్లాడుతూ... గురువే ప్రాధాన్యమని ఈనాటి చిన్నారులను రేపటి భావి పౌరులుగా తీర్చిదిద్ది సామర్థ్యం గల వారు ఉపాధ్యాయులు అని విద్య నేర్పిన గురువులందరికి పాదాభివందనం తెలియజేశారు. గురుపూజోత్సవ దినోత్సవ సందర్భంగా స్కూల్లో మొక్కలు నాటారు.