బిజెపి, టీఆరెస్ ఇద్దరు తోడు దొంగలే

Published: Tuesday December 14, 2021

టి.పి.సి.సి నాయకులు జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రము లోని టీఆరెస్ ప్రభుత్వం తోడు దొంగ లై రైతు లను మోసం చేస్తున్న విషయం మరిచి స్థానిక పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంను విమర్శించడం స్థానిక టీఆరెస్ ఎమ్మెల్యే బిజెపి ని విమర్శించడం ఇద్దరు కూడబల్కొని రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం రోజున స్థానిక పత్రికా విలేకరులతో మాట్లాడుచు గత పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తనను నిజామాబాదు ఎంపీ గా గెలిపిస్తే కేవలం ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకో స్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన అరవింద్ నేటికీ పసుపు బోర్డు ఎందుకు తెలీదు పసుపు కు మద్దత్తు ధర ఎందుకు తేలేదు అని జువ్వాడి కృష్ణారావు నిలదీశారు అలాగే  మూత పడ్డ నిజాం చక్కెర కర్మాగారం ప్రభుత్వరంగంలో నడుపుతమని ఒకవేళ ప్రభుత్వం నడపటం కాదంటే తాను స్వంత నిధులు ఖర్చు పెట్టిఅయినా ఫ్యాక్టరీ నడుపుతనని హామీలు ఇచ్చిన అరవింద్ ఎందుకు ఫ్యాక్టరీ ప్రారంబించ లేదని ప్రశ్నించరు కాంగ్రెస్ పార్టీ గత 60సంవత్సరాలకాలం లో ఏరోజుకూడా రైతు లకు ధాన్యం తో పాటు ఇతర పంటలకొనుగోలు విషయంలో ఏఇబ్బంది కలగకుండా ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేసిందని వరికీ మద్దత్తు ధర పైన 100రూపాయలు బోనస్ కూడా ఇచ్చామని కృష్ణారావు గుర్తు చేశారు మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయకుండా రైతులు నష్టపోయేల ఎందుకు వ్యవహారి స్తున్నారో ధర్మపురి అరవింద్ ప్రజలకు చెప్పాలని కృష్ణారావు సూటిగా ప్రశ్నించారురా రైస్ అని బాయ్ల్డ్ రైస్ అని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాని కృష్ణారావు అన్నారు 2014 సంవత్సరమ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ దేశంలో బిజెపి కి అధికారం ఇస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగలు ఇస్తాం అని హామీలు ఇచ్చారనిఏడు సంవత్సరాలనుండి దేశంలో 14కోట్ల ఉద్యోగలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని అలాగే రాష్ట్రము లో టీఆరెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఇంటికి ఒక్కఉద్యోగం ఇస్తాం అని కేసీఆర్ హామీలు ఇచ్చారని మరి ఆ ఉద్యోగలు ఏమయ్యా యని జువ్వాడి కృష్ణారావు ప్రశ్నించారు దేశం లోని కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో మాదిరిగా రైతులు పండించి న అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తఉ లకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని కృష్ణారావు డిమాండ్ చేశారు.