26.27 కోట్ల రూపాయల అంచనావ్యయంతో ఎస్ టి పి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి, ప్

Published: Tuesday January 11, 2022
శేరిలింగంపల్లి -ప్రజా పాలన (జనవరి 10) :మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద 7.0 ఎం ఎల్ డి సామర్థ్యం తో 26.27 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించబోయే ఎస్ టి పి నిర్మాణ పనులకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు , పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ పటేల్ చెరువు వద్ద 7.0 ఎం ఎల్ డి సామర్థ్యంతో 26.27 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఎస్ టి పి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. హైద‌రాబాద్ నగరం ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది అని, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కలిపిస్తుంది అని, ప్రజా అవసరాలకునుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తుంది అని, తాగు నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది అని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నాం అని, ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న 772 ఎం ఎల్‌ డీ సీవ‌రేజ్ ప్లాంట్ల‌కు అద‌నంగా 1260 ఎం ఎల్‌ డీ సీవ‌రేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమ‌తి ఇవ్వడం జరిగిందని, దీనికోసం రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని, 31 ప్రాంతాల్లో ఈ సీవ‌రేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూనందుకు, హైద‌రాబాద్ ప్ర‌జ‌ల త‌ర‌పున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రివర్యులు కేటీఆర్ కు హృద‌య‌పూర్వ‌క‌మైన ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలియచేస్తున్నం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా ఎస్ టి పి ల నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్ టి పి ల నిర్మాణం పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. ఏ చిన్న సమస్య తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా 31 మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల లో భాగంగా మన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో 7 ఎస్ టి పి లకు నిధులు మంజూరి చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి. మంత్రివర్యులు కేటీఆర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేసిన గాంధీ. చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం, సుందరికరణ చేసి, ప్రజలకు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తామని మరియు ఎస్ టి పి ల నిర్మాణం కొరకు స్థలాల పరిశీలిన అనుసరించాల్సిన విధానాల క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్థలాలను పరిశీలించిన సంగతి విదితమే, ఎస్ టి పి ల నిర్మాణం త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, అన్ని హంగుల తో, సకల సౌకర్యాల తో ఎస్ టీ పి ల నిర్మాణము చేపడుతామని, నాణ్యత ప్రమాణాల తో నిర్మాణం చేపడుతామని మియాపూర్ పటేల్ చెరువు 7.0 ఎం ఎల్ డి కెపాసిటీ 26.27 కోట్ల అంచనావ్యయం. గంగారాం పెద్ద చెరువు - 20.0 64.14 కోట్ల అంచనావ్యయం. దుర్గం చెరువు 7.0 ఎం ఎల్ డి 25.67 కోట్ల అంచనావ్యయం. కాజాగుడా చెరువు. 21.0 - 61.25 కోట్ల అంచనావ్యయం. అంబిర్ చెరువు 37.0 100.87 కోట్ల అంచనావ్యయం. ఎల్లమ్మ కుంట చెరువు జయనగర్ 13.50 43.46 కోట్ల అంచనావ్యయం. పరికి చెరువు - 28.0 ఎమ్ ఎల్ డి కెపాసిటీ 83.05 కోట్ల అంచనావ్యయం.పైన పేర్కొన్న ఎస్ టి పి ల నిర్మాణంలకు నిధులు మంజూరి అయినవి అని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జలమండలి అధికారులు జలమండలి ఎస్ టి పి విభాగం సి జి ఎం పద్మజ, జిఎం వాస సత్యనారాయణ, డీజీఎం దీపాలి మరియు మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ తెరాస నాయకులు కార్యకర్తలు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.