జన్మభూమి రుణం తీర్చుకున్న ఎన్నారై భాగం రాకేష్

Published: Friday July 22, 2022
బోనకల్ ,జులై 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని
గోవిందాపురం ఏ గ్రామంలో ఎస్సీ కాలనీలో సుమారు 30 వేల రూపాయల విలువ చేసి వీధిలైట్లను గ్రామ ప్రజలు సౌకర్యార్థం రాకేష్ ఇవ్వటం జరిగినది. గ్రామ అభివృద్ధిలో తన వంతు సహాయంగా అనేక రకాల సేవా కార్యక్రమాలను భాగం రాకేష్ నిర్వహించినారు. ఆంధ్ర సరిహద్దు అయిన కేఎల్ రావు రోడ్డుకి ఇంకా కొంతమంది గ్రామస్తులతో కలిసి కంప పీకటానికి ఆర్థిక సాయం అందించినాడు.అదేవిధంగా గ్రామంలో పేదరికంలో ఉన్న పేదవారికి ఆర్థిక సాయం నిత్యవసర వస్తువులను అందించినారని, రాకేష్ సేవలను గ్రామస్తులు అభినందించారు. ఎస్సీ కాలనీలో వీధిలైట్లను ఏర్పాటు చేసినందుకు రాకేష్ కు గ్రామ వైస్ సర్పంచ్ ఇస్రం బుజ్జి పంచాయితీ నెంబర్ గండమాల రాయప్ప, గండమాల ఆనందరావు, షేక్ రంజాన్, ఇష్టం భాస్కర రావులు కృతజ్ఞతలు తెలియజేసినారు.