వరిదాన్యం కొనుగోలు కేంద్రంలో రైతన్నలతో ఎమ్మెల్యే మాటమంతి

Published: Monday May 10, 2021
జగిత్యాల, మే 09 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల నుండి రాయికల్ వెళ్లే మార్గమధ్యలో శంకులపల్లె వరిదాన్యం కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే డా. సంజాయ్ కుమార్ కొనుగోళ్ల తీరుపై రైతన్నలతో ముఛ్చడించారు. శంకులపల్లె వద్ద ప్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చూసిన ఎమ్మెల్యే కాసేపు ఆగి కొనుగోలుపై ఆరా తీశారు. కొనుగోలు తీరుపై ఇంచార్జితో మాట్లాడగా కొనుగోలు కేంద్రంలో రైస్ మిల్లులతో ఎలాంటి ఇబ్బందులు లేవని ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందని అనడంతో రైతులు సంతోషపడగా ఎమ్మెల్యే హర్షంవ్యక్తం చేశారు. దేశం మొత్తంలోనే అత్యధిక పంట తెలంగాణలో పండిందని రైతులు ధాన్యాన్ని తప్ప తాలు లేకుండ తేవాలని నాణ్యమైన ధాన్యానికి కటింగులు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట మల్లికార్జున్ నరేష్ రాజు తదితరులు ఉన్నారు.