పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజలు తోడ్పాటు అందించాలి: సర్పంచ్ రవీంద్ర

Published: Friday March 04, 2022
బోనకల్, మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి ప్రణాళిక వలన విడుదలయ్యే అభివృద్ధి నిధుల మూలంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారబోతున్నాయని బ్రాహ్మణ పల్లి సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర గురువారం ప్రాథమిక పాఠశాల బ్రాహ్మణపల్లిలో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిదామని గ్రామంలో దాతలు ఎవరైనా ఉంటే విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ తాటికొండ శేషయ్య, ప్రధానోపాధ్యాయులు గుగు లోతు రామకృష్ణ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రవికిరణ్, జంగం అర్లప్ప, ఉపాధ్యాయులు శశి కుమార్, మురళి మోదుగు, పెంజిన్, కొంగర వెంకట కృష్ణ, మందడపు రమ, చావా గోపాలకృష్ణ, కొంగర శ్రీకాంత్ మోదుగు యస్లీజియన్, మందడపు నరసింహారావు, వంగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.