ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

Published: Wednesday December 07, 2022
పాలేరు డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గువ్వలగూడెం సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వంగూరి ఉష ఆధ్వర్యంలో ప్రభుత్వ హస్పిటల్ లో రోగులకు వైద్యాధికారి డాక్టర్.కె. రాజేష్ చేతుల మీదుగా పాలు, పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.