వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి

Published: Tuesday December 27, 2022

బోనకల్, డిసెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను జయప్రద చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సుమారు 100 మందితో సిపిఎం సీనియర్ నాయకులు బిల్లా విశ్వనాథం అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో దొండపాటి మాట్లాడుతూ ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు పడుతున్న కష్టాల గురించి అదేవిధంగా వారి సమస్యల పరిష్కారం కోసమే ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకు గిట్టుబాటు ధర, కనీస వేతనం, ఉపాధి హామీ విద్యా ,వైద్యం, లాంటి కనీస సౌకర్యాలు అందడం లేదని, ప్రపంచంలో భారతదేశం ఆకలి సూచిలో ఉన్నదని, వ్యవసాయ రంగంలో సన్నా, చిన్నకారు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ విధానాల వలన రైతులు వ్యవసాయం చేయలేని స్థితిలో అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయంపై ఆధారపడిన వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉన్నదని తెలియజేశారు. రైతుల సమస్య పరిష్కారానికే వ్యవసాయ కార్మిక సంఘం కృషి చేస్తుందని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు జరిపి మార్గాన్ని నిర్దేశించుకోవడానికి ఈ మహాసభ జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కావున మహాసభలకు వ్యవసాయ కూలీలు, రైతులు అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బిల్లా విశ్వనాథం, చెన్నా లక్ష్యాద్రి, మాజీ సర్పంచ్ భూక్కాజాలు, గద్దె రామారావు, వార్డు మెంబర్ ఉప్పర శ్రీను, బొబ్బిలపాటి రాజు, బాధావత నాగేశ్వరరావు, గుగులోత్ శ్రీను,గ్రామంలోని వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.