ఛాంపియన్ అకాడమీ క్యాలెండర్ను విడుదల చేసిన ఎమ్మెల్యే

Published: Wednesday December 21, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 20 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ వన్ కంప్యూటర్ శిక్షణ కేంద్రం, ఛాంపియన్ అకాడమీ 2023 సంవత్సరపు  క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విడుదల చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులకు ఈ అకాడమీ ద్వారా శిక్షణ పొందిన వాళ్లు పెద్దపెద్ద కంపెనీలలో ఉన్నత ఉద్యోగాలు సాధించి గౌరవంగా బ్రతుకుతున్నారని, వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి ఆయన అభినందనలు తెలిపారు.
మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించి ఉన్నత విద్యా శిఖరాలకు అందించాలని, కంప్యూటర్ శిక్షణ యాజమాన్యాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్ అకాడమీ డైరెక్టర్ వెంకటేష్ ,  మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, పలువురు కౌన్సిలర్లు, మరియు టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.