డెంగ్యూ వ్యాది పై అవగాహన

Published: Thursday August 26, 2021
మధిర, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : ఉదయం మధిర పట్నంలో సిపిఐ ఆపీస్ రోడ్ లో కురువెళ్ల రెసిడెన్సీ నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి డెంగీ పోసిటీవీ అని నిర్దారణ కాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరుపున మలేరియా విభాగం డిఎంఒ  సంధ్య ఆదేశాలు మేరకు నుండీ పిహెచ్సి దెందుకూరు డా.పుష్ప లత ఆధ్వర్యంలో పారామెడికల్ బృందం ఇంటింటికి జ్వరాలు సర్వే మరియు డ్రై డే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపల్ కమిషనర్ శ్రీమతి రమాదేవి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది ఇంటింటికి గదులు లోపల స్ప్రేయింగ్ చేయించి నారు ఇంటింటికి డెవాటరింగ్ చేయించినారు కార్యక్రమంలో ఆరోగ్య పరివేక్ష కుడు లంకా కొండయ్య బృందం దోమలు నివారణపై కరపత్రాలు పంపిణి చేసినారు. ఈ కార్యక్రమంలో ఎఎన్ఎం వై లక్ష్మి హెల్త్ అసిస్టెంట్ గుర్రం శ్రీను అంగన్వాడీ పద్మాలత ఐకేపీ ఆశ కార్యకర్తలు మెప్మా సిబ్బంది మధిర మున్సిపల్ సిబ్బంది మరియు మలేరియా ఫీల్డ్ వర్కర్ వేము వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.