గ్రామాభివృద్ధికి దివిస్ సహకారం అభినందనీయం ----- బాతరాజు సత్యం

Published: Friday November 25, 2022

 

చౌటుప్పల్ నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో దివిస్ లాబరేటిస్ లిమిటెడ్ వారి 17,40,432/- అంచనా విలువతో రెండు అదనపు తరగతులు కోసం మొదటి అంతస్తు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పంతాంగి గ్రామ సర్పంచ్ బాతురాజు సత్యం అనంతరం గ్రామ సర్పంచ్ బాతరాజు సత్యం మాట్లాడుతూ దివీస్ వారు పంతంగిలో సిసి రోడ్లు డ్రైనేజీలు అండర్ డ్రైనేజర్ వాటర్ ట్యాంక్ మోడల్ నేచర్ ఫారెస్ట్ అభివృద్ధి చేశారని అన్నారు అలాగే ఎంపీపీ పాఠశాల లో నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించారన్నారు సుమారు కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు పుస్తకాలు యూనిఫార్మ్స్ స్కాలర్షిప్లు అందిస్తుందన్నారు దివిసువారికి పంతంగి గ్రామ తరపున కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బోయ లింగస్వామి వార్డ్ మెంబర్స్ వేణు లింగస్వామి కల్పనా నాగరాణి విద్య కమిటీ చైర్మన్ భగత్ గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.,