అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

Published: Sunday October 10, 2021

మధిర ప్రజా పాలన ప్రతినిధి 9అక్టోబ శ్రీలక్ష్మీ పద్మావతిసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బంజారా కాలనీ మధిర ఈ రోజు అన్నదానం దాతలు చెడే రామకోటేశ్వరరావు ధర్మపత్ని పద్మావతి ఐలూరు కృష్ణా రెడ్డి ధర్మపత్ని కృష్ణవేణి ఆర్థిక సాయంతో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయ అధ్యక్షుడు గొండేల ముత్తయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శనివారం దాతల సహకారంతో అనంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారుఈ కార్యక్రమంలో కటకం నరసింహారావు వేమిరెడ్డి సుమతి తాళ్లూరి కృష్ణ సూరి పాల్గొన్నారు అనంతరం వర్తక సంఘ వెంకటేశ్వర స్వామిస్వామి దేవాలయంలోఅన్ని దానాలు కంటే అన్నదానం మిన్న అని ఆర్యవైశ్య సంఘం నాయకులు తూములూరి ఉపేందర్  అన్నారు. శనివారం వర్తక సంఘం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి శనివారం వర్తక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.