ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *బడ్జెట్ లో 5శాతం నిధులు, జివో 17రద్దు చెయ్యాలిన

Published: Tuesday January 31, 2023
వికలాంగులకు రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని ఆసరా పెన్షన్ల మంజూరుకు ఆదయపరిమితి విధించే జీవో 17 రద్దు చేయాలని
జిల్లావ్యాప్తంగా వికలాంగుల రుణాలు స్వయం ఉపాధి కోసం వేలాదిమంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటివరకు 25 శాతం మందికి కూడా రుణాల మంజూరు చేయలేదు వికలాంగుల వివాహ ప్రోత్సాహం కోసం గత సంవత్సరం 105 మంది దరఖాస్తు చేసుకుంటే 65 మందికి మాత్రమే మంజూరు చేశారు. జిల్లావ్యాప్తంగా బ్యాటరీ వీల్ చైర్స్ కోసం 150 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి 2022  ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరికరాలు పంపిణీ చేయడం లేదు తక్షణమే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించి స్వయం ఉపాధి రుణాలు పరికరాలు పంపిణీ చేయాలి ఈ కార్యక్రమంలో జిల్లా కోశాదికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ జిల్లా నాయకులు బుస్సు పాండురంగరేడ్డి ఉపాధ్యక్షుడు చేగురి శేఖర్ ఎర్పుల జంగయ్య  మహిళా విభాగం నాయకురాలు వేముల కుసుమ వరలక్ష్మి భుయ్యంకార్ లక్ష్మీ బాయి సాయినాథ్ మంజుల పల్లవి శ్యామల నరేష్ తదితరులు పాల్గొన్నారు