ప్రతి గర్భిణీస్త్రీ పేరు నమోదు చేయించండి : హెల్త్ సూపర్ వైజర్ కొండయ్య

Published: Thursday February 10, 2022
మధిర ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంం పరిధిలో దెందుకూరు గ్రామంలో బుధవారం నాడు పిహెచ్సి దెందుకూరు నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున నడుస్తున్న నెల వారి గర్భిణీ లకు బాలింతల పిల్లలకు వేసే వ్యాది నిరోధక టీకా కార్యక్రమం నందు హాజరైన గర్భిణీ స్త్రీల నమోదైనవెంటనే మాతా శిశుసంరక్షణ రికార్డు లో నమోదు చేసి వారికీ టీకాల కార్డు ఇవ్వలని పిహెచ్సి వైద్య అధికారులు సూచన మేరకు ఆరోగ్య పరి వేక్షకుడు లంకా కొండయ్య పారా మెడికల్ బృందం నాకు తెలియపరచి నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అది కారులు ఆదేశాలు మేరకు గ్రామల్లో పట్టణల్లో స్థానిక ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అర్హత గల దంపతులను గుర్తించి మరియు కొత్తగా వివాహము జరిగిన దంపతులను గుర్తించి వారు గర్భం దాల్చితే వెంటనే నమోదు చేసి టార్గెట్ అచీవ్ మెంట్ పెంచాలని సూచించారు. అనంతరం ఐసీడీస్ కేంద్రం నందు గర్భిణీ స్త్రీ ల నమోదు కార్యక్రమం గురించి స్థానిక అంగన్వాడీ టీచర్స్ యెక్క రికార్డ్స్ పరిశీలించి నారు. కరెక్ట్ డెలివరీ డేట్ గుర్తించి ప్రసవ సమయంలో సుఖ ప్రసవానీకి వెంటేనే 108 ద్వారా మరియు 102 వాహనం ద్వారా ప్రభుత్వహాస్పిటల్ కు పంపాలని సూచించినారు. ఈ కార్యక్రమం ఎఎన్ఎమ్ లు రాజేశ్వరి అరుణ ఐసీడీస్ టీచర్స్ గుర్రం స్వరాజ్యలక్ష్మి గుర్రం అరుణ ఆశ కార్యకర్తలు బేగం, సత్యవతి, విజయకుమారి దేవమని  కళ్యాణి మరియు గర్భిణీ లు బాలింతలు పాల్గొన్నారు.