ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి *అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయిస్ బ్రె

Published: Thursday January 05, 2023
ఇబ్రహీంపట్నం టౌన్ వినోబా నాగర్ లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆధ్వర్యంలో ప్రపంచ 214 లూయిస్ బ్రెయిలీ దినోత్సవం  సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ  అని అన్నారు. లూయిస్ బ్రెయిలీ  బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4 వ ఏట పూర్తిగా చూపును కోల్పయడు పారిస్‌లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.
అంధులకు సులభంగా చదువుకోవడానికి  లిపి కోసం కృషి చేశాడు.
20 సంవత్సరాల యువకుడైన బ్రెయిల్‌ తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. మరి 5 సంవత్సరాల పరిశోధనలో బ్రెయిల్‌ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు. ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల బ్రెయిలీ మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవా త్మకమైన మార్పు, ఆరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్కనుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు.
ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరు చుక్కలలో బ్రెయిల్‌ రూపొందించాడు. ఈ రకంగా చుపులోపం ఉన్నవారు బ్రెయిలులో వ్రాయగలరు. చదవగలరు. వారికి ఇతరుల సహాయం అక్కరలేదు. ఇంగ్లీషు, తెలుగు, భాషలన్నీ ఎడంనుండి కుడికి వ్రాస్తాంకదా. బ్రెయిల్‌లో కుడినుండి ఎడమకు వ్రాయడం జరుగుతుంది. బ్రెయిలులో టైపురైటర్లు కూడా రూపొందించడం జరిగింది. అంధులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణానంతరమే వచ్చింది. సంగీతాన్ని కూడా తన లిపిలో వ్రాయడం అతని విశిష్టత. ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిలీ లిపికి గుర్తింపు వచ్చి అంగీకరించినా, అమెరికా 1916 లోనే దానిని ఆమోదించిందని, లూయిస్ బ్రెయిలీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.  
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిల్లలమర్రి ప్రభాకర్ గాయకవాడ శివాజీ బస్సు పాండురంగారెడ్డి ఇబ్రహీంపట్నం టౌన్ నాయకులు దివిటీ యాదగిరి తదతరులు పాల్గొన్నారు.