ఘనంగా లాలా జలపతిరాయ్ వర్ధంతి ** నివాళులర్పించిన అరిగెల నాగేశ్వర్ రావు

Published: Friday November 18, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 17 (ప్రజాపాలన, ప్రతినిధి) :  స్వాతంత్ర సమరయోధుడు లాల జలపతిరాయ్ వర్ధంతిని జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు నివాసంలో లాలా జలపతిరాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న త్రిమూర్తులలో లాలాజలపతిరాయ్ (బాల గంగాధర్ తిలక్- బిపిఎన్ చంద్రబాల్ ) ఒకరు అన్నారు. ఈయనకు పంజాబ్ కేసరి అనే బిరుదు ఉందని, ఆయన సైమాన్ కమిషన్ కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో లాటి దెబ్బలు తగిలి మరణించాడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంధం శ్రీనివాస్, నాయకులు గుండా వెంకన్న, సర్పంచులు భీమేష్, శ్రీనివాస్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.