తెలంగాణ రాష్ట్రం లో కుల వృత్తుల అభివృధికి ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి --ఎమ్మేల్యే డా. సంజయ్ కుమా

Published: Tuesday July 26, 2022

జగిత్యాల, జులై 25 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ 10వ వార్డు  ఎలుక భావి వాడ గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి 5 లక్షల ప్రొసీడింగ్ కాపీని గంగపుత్ర సంఘ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్ లో  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. అనంతరం మాట్లాడుతూ గంగ పుత్రుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని, అన్ని కుల వృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసిఆర్  కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిషన్ కాకతీయ లోభాగంగా చెరువు పూడిక తీసి, కట్టలు సరిచేసామని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం లో అన్ని చెరువులు జల కళ ను సంతరించుకున్నాయి అని, చెరువుల్లో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామని, రాష్ట్రం లో మత్స్య సంపద పెంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు సిరికొండ భారతి రాజయ్య, అరుముళ్ల నర్సమ్మ, రాజ్ కుమార్, ఎఫ్ సిఎస్ అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, డైరెక్టర్ ఆరుముల్ల పవన్, ఎంపీటీసీ భూపెళ్లి శ్రీనివాస్, నాయకులు జంభర్తీ రమేష్, నాచుపల్లి రెడ్డి, నారాయణ, కిరణ్, నరేందర్, నర్సయ్య, గంగారజం, రాజం, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.