కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుని నియామకం

Published: Friday March 05, 2021

జన్నారం మార్చి 4 ప్రజా పాలన   జన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా మామిడిపల్లి  ఇంద్రయ్య నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రామగిరి  బానే ష్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు నియమించినట్లు ఆయన తెలిపారు. నాపై  నమ్మకంతో  పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ పదవి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నూతన ఎస్సీ సెల్ అధ్యక్షులు గా నియమితులైన ఇంద్రయ్య తెలిపారు.