మున్సిపల్ ఆఫీస్ నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Published: Thursday March 09, 2023
మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధిర మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత అధ్యక్షతన కమిషనర్ అంబటి రమాదేవి అధ్వర్యంలో బుధవారం ఘనముగా నిర్వహించడం జరిగింది.ఈ సంధర్భంగా చైర్ పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ మహిళామణులనందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు.అవని లో ప్రత్యక్ష దైవం మహిళ
సకలకోటి జీవరాసులకు మూలం అమ్మా...
 స్త్రీ లేని జీవ జాలం లేదు
సృష్టికి మూలం మహిళ తల్లిగ ,చెల్లిగా మానవ జీవన గమనం లో ఓ మహత్తర శక్తి గా ఆది దేవతగాఅనుక్షణం అనునిత్యం ఓర్పు తో నేర్పుతోసహనం తో సాటి లేని వీర వనిత లా ప్రతి పురుషుడి విజయం వెనుక తనుండి
కుటుంబ జీవన పయనం లో ముందుండి నడిపే సాటి లేని మేటి మహిళా కదా ,పొదుపుతో అదుపు తప్పకుండా ఆర్థిక సమస్యలు రాకుండా చాక చక్యం తో కుటుంబ పోషణ లో కీలక బాగస్వామి మహిళ కదా.. అని తెలిపినారు.ఈ సందర్భముగా మహిళ వార్డు కౌన్సిలర్ లను, మెప్మా ఆర్పీ లను మహిళ శానిటేషన్ సిబ్బందికి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మొండెం లలిత, వైస్ చైర్ పర్సన్ , వార్డు కౌన్సిలర్ లు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.