చింతకాని మండలం పెద్ద గోపతి రైతులతో భట్టి ముఖాముఖి

Published: Wednesday February 24, 2021
ప్రజా పాలన ఫిబ్రవరి 23పాములా కాటేస్తున్న మోదీ తేలులా కుట్టేందుకు వస్తున్న కేసీఆర్ ఇద్దరికీ కర్రు కాల్చి వాతలు పెట్టాలి పెద్దగోపతి రైతులతో ముఖాముఖి సభలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కగారు
జన సముద్రమైన పెద్దగోపతి పల్లె.. అడుగడుగునా భట్టికి జననీరాజనాలు పలికిన మహిళలు.. రైతలు..గ్రామ ప్రజలు.. భట్టికి... కోలాటాలతో.. గజ్జెకట్టి..  బోనమెత్తి.. అపూర్వ స్వాగతం పలికిన  ఆడబిడ్డలుఇంత వరకూ ఎవరూ చేయని విధంగా అన్నదాతల సమస్యలు తెలుసుకునేందుకు పొలంబాట పట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. తన యాత్రను సోమవారం ముగించారు. రైతుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు 14 రోజుల నుంచి ముఖాముఖి యాత్రను ఆయన దాదాపు 2 వేల కిలోమీటర్ల మేర చేయడం గమనార్హం. 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో సోమవారం విజయవంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో మొదలు పెట్టిన రైతులతో ముఖాముఖీ-పోరుబాట, పొలం బాట కార్యక్రమం ఖమ్మం జిల్లాలోని పెద్ద గోపతి రైతులతో మాట్లాడడంతో ముగిసింది. తెలంగాణ అంతటా పర్యటించి.. పలు నియోజకవర్గాల్లో రైతులతో ముఖాముఖి జరిపి.. అదే విధంగా రహదారి పొడవునా.. పొలాల్లో పనులు చేస్తున్న అన్నదాతలతో నేరుగా మాట్లాడి.. వారి సమస్యలను తెలునుకున్నారు. 
కొనుగోలు కేంద్రాలు, పావలావడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు ఐకేపీ కేంద్రాలు ఎత్తేస్తే రైతుల భవిష్యత్ ఏమిటి? ఇలాంటి పరిస్థితులు ఎదరయితే.. రైతులు పంటలు పండిస్తారా? పంటలు బంద్ పెడితే.. ప్రజల పరిస్థితి ఏమిటని భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహంగా ప్రశ్నించారు. రైతులతో ముఖామఖి ముగింపు సందర్భంగా భట్టి విక్రమార్క పెద్దగొపతి సభలో మాట్లాడారు. ఆయనతో పాటు.. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుతో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య,  ఏఐసీసీ కార్యదర్శి మజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం సిటీ కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీపోట్ల నాగేశ్వర రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాములా రైతులను కాటేసేందుకు వస్తోందని.. అలాగే తేలుగా కేసీఆర్ నక్కినక్కి రైతులను కుట్టేందుకు వస్తున్నారని చెప్పారు. ఇలాంటి పాములపై ములుగర్రను, తేలుపై చెప్పను ఎత్తాలని భట్టి ఆగ్రహంగా చెప్పారు. ఇలాంటి వారిని కొట్టకపోతే.. రైతులు తీవ్ర నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్లాల్సి వస్తుందన్నారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి వీళ్లకు కర్రు కాల్చి వాతలు పెట్టాలని పిలుపునిచ్చారు. లేకపోతే మనల్ని మనం రక్షించుకోలేకమని భట్టి చెప్పారు. 
ఇదిలావుండగా.. కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వస్తే.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని సబ్సిడీలు కొనసాడిస్తామని భట్టి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక పెద్ద మూర్ఖుడని భట్టి ప్రజలకు చెప్పారు.  రైతులతో ముఖాముఖి అనేది ఒక రాజకీయ సభ కాదు.. ఇప్పడు ఓట్లు లేవు.. ఇప్పడున్న ప్రభుత్వాలకు మరో మూడేళ్ల అధికారం ఉంది.. కానీ.. వాళ్ల ఇష్టారీతిన పాలన చేసుకుంటూ పోతే.. రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఇబ్బందుల్లో పడతారు..  ఆ విషయాలను ప్రజలకు వివరించి.. వారి మధ్య చర్చ జరగాలని మాత్రమే ఈ కార్యక్రమం చేసినట్లు భట్టి చెప్పారు. పొలాల్లో.. గ్రామాల్లో.. అన్ని చొట్లా దీనిపై చర్చలు జరిగితేనే పరిష్కారాలు వస్తాయి చెప్పారు. రైతులతో ముఖాముఖి-పొలంబాట, పోరుబాట కార్యక్రమాల్లో అనేకచోట్ల రైతులు మవాళ్ల కష్టాల చెప్పినట్లు భట్టి వివరించారు. ప్రజాప్రతినధులు అందుబాటులో లేరు.. ఫసల్ బీమా యోజన రాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.960 కోట్ల కట్టకపోవడం వల్ల మాకే బీమా రాలేదని ఆదిలాబాద్ జిల్లా రైతులు బాధపడ్డారిన భట్టి అన్నారు. అలాగే మంచిర్యాల రైతులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని సబ్సీడీలను ఆపేసిందని అన్నారు. ఇప్పుడ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే.. మా పరిస్థితి అగమ్య గోచరమని అన్నట్లు చెప్పారు. 
శ్రీధర్ బాబు, మంథని ఎమ్మెల్యే
రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెట్టేందుకు సీఎల్పీ బ్రుందం ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతి పేదవాడికోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రం చీకటి చట్టాలను ప్రవేశపెట్టింది. రైతుల పక్షాన పోరాటం చేయాలి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో రైతుల పక్షాన పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కిందకు దించాలి. డీజిల్ ధరలు రెండు రోజుకోసారి పెరగుతున్నాయి. రూ. 200 వరకూ పెరిగే ప్రమాదం ఉంది. డీజిల్ ధరలు పెరడం వల్ల రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులు నష్టపోతున్నారు. మూడు నల్ల చట్టాల వల్ల కనీస మద్దతు ధర రైతులకు ఉండదు. మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. నా జిల్లాలో హత్య చేబడ్డ న్యాయవాద దంపతుల హత్యపై నిష్పక్షపాత విచారణ జరపాలి. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఒక మహిళను నడిరోడ్డుపై హత్య చేస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్.. ఎవరూ మాట్లాడరు. 
పొడెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే
పోరాటం చేయకపోతే పొలాలు, భూమలు పోతాయి. రైతు వ్యతిరేక చట్టాల వల్ల అంబానీ, అదానీలు అక్కునే పరిస్థితులు వస్తాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, మోడీ, కేసీఆర్ లను దించాలి. కేసీఆర్ ఒక పెద్ద దోపిడీ దొంగ. కేసీఆర్ యూటర్న్ తీసుకుని మోడీకి గులాం చేస్తున్న కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి. లోఫర్ ప్రభుత్వాలను గద్దె దించకపోతే.. మనకు మనుగడ ఉండదు.
మధు యాష్కి గౌడ్, ఏఐసీసీ సెక్రెటరీ
ప్రజలతో ఏర్పడ్డ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన రైతు వ్యతిరేక విధానాలతో పొలంబాట పట్టాల్సిన రైతులు పోరుబాట పడుతున్నారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరుబాట పడుతున్నారు. కేసీఆర్, మోదీలు.. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. భయాందోళనలు స్రుష్టిస్తున్నారు. అక్రమాస్తలు కూడబెట్టుకుంటూ.. పాలన సాగిస్తున్నారు. రైతుబంధ పథకం ఇచ్చి వివిధ సబ్సీడీలను కేసీఆర్ ఆపేశాడు. రైతుబంధుతో రైతులను మోసం చేస్తున్న కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. ప్రశ్నిస్తే. అరెస్టులు.. ప్రశ్నిస్తే.. హత్యలు ఈ ప్రభుత్వం చేయిస్తోంది. న్యాయవాదులను నడిరోడ్డుపై హత్య వెనుక.. టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతు.. పాలన చేస్తున్నారు. కనీస మద్దతు ధర లేకపోతే దేశం విచ్ఛిన్నమవుతుంది. దౌర్భాగ్య కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిందే. 
అన్వేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్
రాష్ట్రంలో జరుగుతున్న రైతుల వ్యతిరేక విధానాలను రైతులకు వివరించేందుకు ఈ కార్యక్రమం. కేసీఆర్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి రైతులను నట్టేట ముంచింది. రైతురుణమాఫీ వల్ల రైతులకు జరిగింది ఏమీలేదు. రుణమాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. రుణమాఫీ జరకపోవడం వల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ ఇచ్చింది. పంట నష్టం పరిహారం కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. పంటల బీమా లేదు. పంట నష్టపరిహారమే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.930 కోట్లు రావాలి. మక్కలు.. సన్నాలను ప్రభుత్వం కొనకపోవడం వల్ల.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ మద్దతు ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వాలు కొనుగోలు ఆపితే రైతుల పరిస్థితి అగమ్య గోచరం. పర్సగాని క్రిష్ణయ్యటీఆర్ఎస్ పాలనలో రైతులు ఆగం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే ఎఖ్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. కొట్లపల్లశ్రీనివాస రావుమాకు వచ్చింది వ్యవసాయమే మాకు ఎక్కడా మాఫీ కాలేదు. గిట్టుబాటు ధర లేదు. నేను రూ. 70 వేలు వ్యవసాయ రుణం తీసుకుంటే.. కట్టింది కూడా రూ.70 వేలు.. నాకు ఎక్కడా రుణమాఫీ కాలేదు. ఐకేపీ ఎత్తేస్తే.. మా బతుకులు ఆగమే. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు కొనసాగించకపోతే.. ఉద్యయం చేయాలి. ఈ ప్రభుత్వాన్ని దించాలి. గోవిందరావు, రైతు
నేను 20 ఎఖరాలు మొక్కజొన్న వేసిన. వరి ఏసినా.. నాకు ఇబ్బందిగా ఉంది. వరి కొంటామని చెప్పిన ప్రభుత్వం కొనకపోవడంతో.. రూ.1200 లకు అమ్ముకోవాల్సింది. రైతుబంధు అవసరం లేదు.. మద్దతు ధర కావాలి. కూలీకి కూలీ గిట్టడం లేదు. విత్తనాల్లో మోసమే.. పెట్టుబడిలోనూ మోసమే.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం ఆపేస్తాం. పంటులు పండించడం నిలిపేస్తాం. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. వంద క్వింటాలు తీసుకుని రైతు ఎక్కడకు తీసుకెళ్లి అమ్ముకోవాలి? ఎంత దూరం పోవాలి. ప్రభుత్వం దిగి రైతుల కాడికి రావాలి. రైతులను ఎవరూ లెక్క చేయడం లేదు. ఒక్క ఏడాది మనం పంటలు పండించడం ఆపేస్తే.. ఎంతటివాడైనా దిగిరావాల్సిందే. కూరపాటి కిషోర్, రైతు 
మొక్కజొన్న వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేపీ కేంద్రాలు ఎత్తేస్తాం.. మక్కలు కోనం అంటున్న ఈ ప్రభుత్వంతో యుద్ధం చేయాలి. కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే. రైతు రుణమాఫీ కాలేదు. రుణమాపీ కాకపోతే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సివస్తోంది. డ్రిప్ ఇరిగేషన్, పాలిహౌజ్ లు కూడా ఇవ్వడం లేదు. రైతులంతా పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై యుద్ధం చేయాలి.భట్టికి జనఘన స్వాగతం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన రైతులతో ముఖాముఖి కార్యర్యక్రమం ఆఖరి రోజున ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామంలో జరిగింది. రైతులతో మాట్లాడేందుకు తమ గ్రామానికి వస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన టీమ్ కు పెద్ద గోపతి గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో సీఎల్పీ నేత భట్టికి, ఇతర సీఎల్పీ బ్రుందానికి స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరకు చేరుకున్న భట్టికి మహిళలు కోలాటలతోనూ.. బతుకుకమ్మలతోనూ తమ అభిమాన నాయకులకు స్వాగతం చెప్పారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో మహిళలు, రైతులు, పలు గ్రామాలు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.