ఉచిత వ్యాక్సినేషన్ దేశ హితం కోసం ప్రధాని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం

Published: Wednesday June 23, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హఫీజ్ పెట్, మియపూర్ డివిజన్ ఆధ్వర్యంలో పర్యవేక్షించి డాక్టర్లకు, వ్యాక్సినేషన్ సిబ్బందికి జ్యూసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు (వాక్సినేషన్) వేయిస్తామని ప్రకటించారని అన్నారు. ఈ సందర్భంగా వారికి మనం ధన్యవాదాలు తెలపాలని, దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయంతో అర్ధమవుతుంది. ఇది దేశ హితం కోసం మరోసారి ప్రధాని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్ట మొదటి ప్రాధాన్యతని ప్రధాని మోడీ ప్రకటించారని అన్నారు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా సరై దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించడమే తన లక్ష్యమని ప్రధాని ప్రకటించడం జరిగిందన్నారు. అన్ని రాష్ట్రలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది కానీ మన రాష్ట్రంలో ఇంకా జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన మీద చెయ్యాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా వాక్సిన్ తీసుకుకోవాలని అయన కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ ను తప్పకుండా వాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మణిక్ రావు, నారాయణరెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, విజేందర్, సాంబ శివ రావు, రఘు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.