యువత దేహ దారుఢ్యాన్ని పెంచుకోవాలి

Published: Wednesday February 16, 2022
ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు టి ఆనంద్
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : దేహదారుఢ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు మిస్టర్ వికారాబాద్ వ్యవస్థాపకులు టి ఆనంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా బాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో సోమవారం రాత్రి మిస్టర్ వికారాబాద్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా టి ఆనంద్ మాట్లాడుతూ నేటి యువత టీవీ లకు వ్యసనాలకు బానిసలు కాకుండా శరీర దారుఢ్యానికి సంబంధించిన ఎక్సర్ సైజులను చేయాలని సూచించారు. తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలిగితే దేహం బాగుపడునోయ్ హితోక్తి ని గుర్తు చేశారు. దేహదారుఢ్య పోటీలలో సుమారు 150 మంది పోటీదారులు పాల్గొన్నారని స్పష్టం చేశారు. యువతలో చైతన్యవంతం తీసుకొని రావడానికి దేహదారుడ్య పోటీలను నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. శారీరక శ్రమ లేక నేటి యువత ఆస్పత్రుల పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. బాడీ బిల్డింగ్ పోటీలు మంచి స్పోర్ట్స్ గా నిలుస్తాయని కొనియాడారు. ఒక బాడీ బిల్డర్ గా తయారు కావడానికి పౌష్టికాహారం, కఠోర శ్రమ, అంకితభావం, సమయపాలన, దృఢ సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉండాలని వివరించారు. వికారాబాదులో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించడానికి ప్రధాన కారణం నేటి యువతలో చైతన్యం తేవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్ పోటీలకు అంతర్జాతీయ న్యాయమూర్తులు సీమబ్ అజీమ్, మహమ్మద్ నజీర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ సాబీర్ ఎంతో చాకచక్యంతో జడ్జిమెంట్ చేశారని తెలిపారు. బాడీ బిల్డింగ్ లో ప్రథమ బహుమతి నితిన్ రెడ్డి తాండూర్, ద్వితీయ బహుమతి వసీం బాబా వికారాబాద్, తృతీయ బహుమతి విశాల్ తాండూర్. మెన్స్ ఫిజిక్ లో ప్రథమ బహుమతి నితిన్ రెడ్డి తాండూర్, ద్వితీయ బహుమతి అశోక్ వికారాబాద్ లకు మెమెంటో సర్టిఫికెట్ అందజేశారు. బాడీ బిల్డింగ్ లో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం బాబా వికారాబాద్ మాట్లాడుతూ ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు పి ఆనంద్ సహకారంతో ప్రోత్సాహంతో నేను ద్వితీయ బహుమతి పొందిన కలిగినందుకు అతనికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు భవిష్యత్తులో నా ఎదుగుదలకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. ఎఐఎంఐఎం నాయకులు మిర్జా ఫెరోజ్ బేగ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం అన్ని జిల్లా ల బాడీ బిల్డర్లు పాల్గొనేలా కృషి చేస్తామని అన్నారు. బాడీ బిల్డింగులో పాల్గొనే వారందరూ ఇప్పటి నుండే అభ్యాసం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ది లైట్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ సామ్ శరణ్ (నాని), సభ్యులు అరుణ్ గౌడ్, ఎఐఎంఐఎఐ నాయకులు మిర్జా ఫెరోజ్ బేగ్, ఆశీష్, మహమ్మద్ నవాజ్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.