చిరు వ్యాపారులకు హైకేర్ ఆసుపత్రి ఔధార్యం

Published: Friday April 23, 2021
మధిర, ఏప్రిల్ 22, ప్రజాపాలన  ప్రతినిధి : ఏడు వేల రూపాయలు విలువచేసే సోలార్ కిట్ ఉచితంగా పంపిణీఈరోజు దేశనేనిపాలెం గ్రామంలో లాంఛనంగా ప్రారంభించిన హైకేర్ హాస్పిటల్ డైరెక్టర్ జంగా ప్రవీణ్ రెడ్డి మధిర హైకేర్ ఆస్పత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ఉచితంగా సోలార్ కిట్ను ఈరోజు అందజేశారు. సోలార్ కిట్లో లైట్, ఫ్యాను, చార్జర్ ఉంటుంది. చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు ఈ కిట్టు ఎంతో దోహదపడుతుంది. ఈ కిట్లు చిరు వ్యాపారులకు ఉచితంగా అందజేస్తున్నట్లు డాక్టర్లు మురళి కృష్ణ రెడ్డి, జంగా నవీన్ రెడ్డి తెలిపారు