విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday December 20, 2022
 మేడిపల్లి, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రస్తుత సమాజంలో ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవ్ ది చైల్డ్ ఆర్గనైజేషన్ వారి సౌజన్యంతో సెటప్ ల్యాబ్ ను  మేయర్ జక్క వెంకట్ రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం, పరిశీలన పెంపొందించుకోవడానికి శాస్త్రీయ భావనలు అనువర్తనాలను విద్యార్థులు పరిశీలించి ఆకలింపు చేసుకోడానికి ప్రయోగశాలలు అవసరమని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ సత్య ప్రసాద్, హెచ్డిఎఫ్సి శ్రావణి వెంకట్ రెడ్డిల సహకారంతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయించినందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో  కో ఆప్షన్ సభ్యులు నదియా జావిద్ ఖాన్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.