జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ- ఇఫ్ నాట్ పాజిబుల్ జాయిన్ ఇన్ స్టూడెంట్ ఆర్మీ

Published: Thursday October 28, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : ABVP సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్టోబర్ 27, 28, 29వ తేదీలలో ఏబీవీపీ మెంబర్షిప్ డ్రైవ్ సందర్బంగా వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇబ్రహీంపట్నం నగర డిగ్రీ కళాశాలలో గణంగా ప్రారంభిచడం జరిగింది ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ.సంజీవ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం అనే నినాదంతో ముందుకు పోతూ, విద్య జీవితం కోసం, జీవితం దేశం కోసం అనే స్ఫూర్తితో విద్యార్థులను జాతీయవాదులుగా మలిచి దేశం కోసం, మాతృభూమి కోసం పనిచేయాలనే తపన కలిగిన విద్యార్థులందరికీ ఏబీవీపీ ఒక వేదికగా ఉంటూ దేశంలోని విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, సామాజిక సమస్యలపై దేశాన్ని జాగృత పరుస్తూ ముందుకు పోతున్న ప్రపంచంలోని అతి పెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ. కావున ఏబీవీపీ లో పని చేయాలనే తపన కలిగిన విద్యార్థులందరికీ సభ్యత్వ నమోదు ద్వారా గొప్ప అవకాశం కల్పించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగించేసుకొని భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి ధనరాజ్, ఏబీవీపీ విభాగ్ టెక్నీకల్ సెల్ కన్వీనర్ శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ పవన్, ఎస్.ఎఫ్.డి కన్వీనర్ సందీప్, నగర కార్యదర్శి హేమంత్, నగర ఎస్.ఎఫ్.డి కన్వీనర్ ప్రవీణ్, నగర సంయుక్త కార్యదర్శి జగదీశ్, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.