రవీందర్ రెడ్డి నగర్లో సమస్యలు పరిష్కరించాలని వినతి

Published: Friday January 13, 2023
మేడిపల్లి, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని రవీందర్ రెడ్డి నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ 
విజయలక్ష్మీకి వినతి పత్రం అందజేశారు. రవీందర్ రెడ్డి నగర్లో ప్రధాన సమస్యలు మంచినీళ్లు,డ్రైనేజ్, 
నాలపై బ్రిడ్జి నిర్మాణ పనులు    జరుగుతూ ఉండటం వలన, నిర్మాణపనులు పూర్తి అయేంతవరకు నాలపై తాత్కాలిక దారిని ఏర్పాటు చేయలని కోరుతూ నగర మేయర్ కు వినతి పత్రం సమర్పించారు.