ఘనంగా జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి

Published: Friday January 13, 2023

ఇబ్రహింపట్నం, జనవరి12(ప్రజాపాలన ప్రతినిధి) మండలంలోని వర్షకొండ గ్రామములో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని  హిందుసేన ఆధ్వర్యములో బస్టాండ్ వద్ద ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి  జయంతిని ఘనంగా నిర్వహించారు  బలమే జీవనం బలహీనతే మరణం మన లక్ష్య సాధనలో మంచి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు యువతే మాత్రమే నా భారత దేశం యెక్క బలంఅని ఇలా ఎన్నో యువతకు  స్ఫూర్తినిచ్చేవ్యాఖ్యలు అందించిన స్వామీజీ వివేకానందను ఆయన జయంతి సందర్భంగా మనము స్మరించుకుంటు ఆ మహానుభావుడు యొక్క లక్ష్యం యువత మేలుకోవడం గ్రామ దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావడం ఈ దేశ అభివృద్ధికి, ధర్మ రక్షణకు యువత ముందుండాలని, బలమైన సంకల్పం కలిగిఉండాలని, కానీ అలాంటి యువత ఈ రోజు చేడు వ్యసనాలకు బానిసై కొన్ని రకాల మత్తు పదార్థాలకు  బానిసై తమ స్వీయ ఉనికిని మరిచిపోయి తమ శక్తి సామర్ధ్యాలను కోల్పోతున్నారు. ఇలా ఉండడం వల్ల ఊరి అభివృద్ధి లో తద్వారా దేశ అభివృద్ధి లో యువత వెనకంజ లో ఉందని
ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ దొంతుల శ్యామల తుకారాం, ఎంపీటీసీ పోనుకంటి చిన్న వెంకట్, ఉప సర్పంచ్ మంగిలిపెల్లి లక్ష్మణ్, వీడీసీ అధ్యక్షులు దోమకొండ రాజన్న, మామిడి సురేష్ రెడ్డి, భా.జ.పా. నాయకులు దగ్గుల అశోక్, పెసరి లక్ష్మన్, చిలివేరి శ్రీధర్, వేముల శ్రీహరి, సల్కం నర్సయ్య, ప్రవాసి మిత్ర గల్ఫ్ నాయకులు కంటం రాజు కుమార్  మరియు హిందుసేన సభ్యులు పాల్గొన్నారు.