వీఆర్ఏ లకు పే స్కేల్ అమలుచేసి ఆదుకోవాలి

Published: Monday September 12, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రధాన భూమిక పోషించే వీఆర్ ఏ లకు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని, వెంటనే వీఆర్ ఏ లకు పే స్కేల్ అమలు చేసి ఆదుకోవాలని సంఘ సేవకుడు కొలిపాక  శ్రీనివాస్ శనివారం ట్విట్టర్ ద్వారా కేసీఆర్ పంపిన వినతిపత్రంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా నిరసన దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి అర్హులైన వారికి  వీఆర్వోగా పదోన్నతి కల్పించి ఆదుకోవాలని, పెరిగిన నిత్యవసారాల ధరల వల్ల ధరలకు అనుగుణంగా వారి జీతాలను సవరించి పెంచాలని, 55 ఏళ్లు నిండిన వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు 10 లక్షల నగదు తో పాటు వారి వారసులకు ఉద్యోగం  ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం ఫై  తెలంగాణ ఎన్జీవో సంఘాలు,   రెవిన్యూ శాఖ లో ప్రధాన మైన వీఆర్ఏల  పట్ల ఉద్యోగసంఘాలు కూడా సిఎం తో సంప్రదిపులు జరిపి ఆదుకోవాలని అన్నారు.
 
 
 
Attachments area